about-image

నమస్తే మీ గొండు శంకర్,

నా ఆశయము:

" ప్రజలే దేవుళ్ళు - సమాజమే దేవాలయం" అని అన్నగారి నినాదాన్ని నరనరాల్లో జీర్ణియించకున్న మా కుటుంబం తరతరాలుగా ఆ ఆశయసాధనకై శ్రమిస్తోంది. ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న నాకు ' నిరంతర శ్రామికుడు' రాజనీతి కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సంక్షోభాలను సవాళ్లుగా తీసుకొని ఒక విజన్ తో మిషన్ గా తీసుకునే మీరే... నా స్ఫూర్తి ప్రధాత, మిమ్ములను మాత్రమే స్ఫూర్తిగా తీసుకుంటూ మీ ఆశీర్వచనంతో ప్రత్యక్ష రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతూ, రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య విలువలతో క్రమశిక్షణతో, నిజాయితీగా పార్టీ నిర్దేశించే విధంగా నడుచుకుంటూ ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధే.. నాకు రెండు కళ్ళుగా మీ ఆశయ సాధనకై మన పార్టీ శాశ్వత సభ్యునిగా నా చివరి శ్వాస వరకు మీ నేతృత్వంలో ఒక నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా, మీ నాయకత్వంలో భవిష్యత్తు నాయకునిగా ఎదగాలన్నదే నా లక్ష్యం... నా ఆశయము.
జై తెలుగుదేశం..
జై జై తెలుగుదేశం...

పేరు : గొండు శంకరరావు
తండ్రి : గొండు జగన్నాధరావు (జగపతి)
పుట్టినతేది : 18-06-1976
చదువు : బి. ఈ సివిల్ (బెంగళూరు యూనివర్శిటీ)
భాషలు : తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం
కులం : పొలినాటి వెలమ
చిరునామ : క్రిష్టప్పపేట గ్రామం & పోస్టు, శ్రీకాకుళం రూరల్ మండలం & జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పిన్: 532 187.

నా అనుభవం

ఎమ్మెల్యే అభ్యర్థి

2024-29
శ్రీకాకుళం నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే

సర్పంచ్ అభ్యర్థి

2021-24
క్రిష్టప్పపేట గ్రామ సర్పంచ్ మరియు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు

M.P.T.C అభ్యర్థి

2014-19
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామం ఎం.పి.టి.సి. మరియు తెలుగుదేశం పార్టీ ఏరియా ఇన్ఛార్జ్

మా రోజువారీ నవీకరణలు

  • అన్ని
  • సమావేశాలు
  • ప్రెస్ మీట్లు
  • ప్రజలకు సేవ
  • ఆత్మీయుల కలయిక

అభివృద్ధి & సంక్షేమ కార్యక్రమాలు

  • శ్రీకాకుళం రూరల్ మండలం- క్రిష్టప్పపేట గ్రామంలో 2వేల ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములకు వందలాది సంవత్సరాల నుండి పంట తెచ్చుకొనుటకు, వ్యవసాయ పనుల కొరకు రోడ్ మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో రైతులందరినీ సమన్వయ పరిచి దాదాపు 2 కి.మీ.ల పొడవు, 20 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని కొరకు ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో పాటు సొంత నిధులను రూ. 10 లక్షల వరకు వెచ్చించి రోడ్ నిర్మాణం చేయడంజరిగింది.

  • క్రిష్టప్పపేట గ్రామానికి ప్రత్యేకంగా రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది.

  • అంపోలు రోడ్ నుండి క్రిష్టప్పపేట గ్రామానికి దాదాపు రూ. 88 లక్షలతో బి.టి. రోడ్ నిర్మాణం.

  • సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మామిడివలస గోడ్డు సీసీ రోడ్ నిర్మాణం

  • క్రిష్టప్పపేట నుండి సింగుపురం వరకు ఎల్.ఈ.డి. లైటింగ్ వేయించడం.

  • సింగుపురం పంచాయతీ మునసబుపేట గ్రామానికి రింగ్ రోడ్ (సిసి రోడ్) ఏర్పాటు చేయడం జరిగింది.

  • సింగుపురం పంచాయతీ పల్లివలస గ్రామానికి రింగ్ రోడ్ వేయించాం.

  • సింగుపురం పంచాయతీ భైరి నాగులువానిపేట గ్రామానికి ఎన్.హెచ్.-16 నుండి కనెక్టింగ్ సీసీ రోడ్

  • క్రిష్టప్పపేట గ్రామంలో సిసి కవర్డ్ డ్రైనేజి నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, అదనపు త్రాగునీరు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, ఎం.పి.యు.పి. స్కూల్కు పక్కా భవనాల నిర్మాణం, మంచినీరు బోర్ల వేయించడం జరిగింది.

  • సింగుపురం పంచాయతీ రోణంకి గ్రామానికి గార చింతాడ రోడ్ నుండి కనెక్టింగ్ సీసీ రోడ్ నిర్మాణం

  • సింగుపురం గ్రామానికి జెడ్సీ రోడ్ నుండి మేనమామ గోర్టు గుండా సాధు మందిరం వరకు రింగ్ రోడ్ నిర్మించడం జరిగింది.

  • సింగుపురం గ్రామం కొండమ్మ చెరువు దగ్గర దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతనిధులు రూ. 10 లక్షల రూపాయలతో చదును చేసి "ఎన్టీఆర్ నగర్ "పేరు మీదుగా సుమారు 350 పట్టాలను నిరుపేదలకు మరియు నీలమ్ జూట్ మిల్లు కార్మికులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఇచ్ఛాపురం పర్యటన సందర్భంగా కొంతమంది లబ్ధిదారులకు ఆయన చేతులు మీదుగా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.

  • సింగుపురం, అలికాం గ్రామాల మధ్యలో ఉన్న దాదాపు 250 ఎకరాల విస్తీర్ణం గల అల్లిచెరువు నిర్లక్ష్యానికి గురైనందున" నీరు-చెట్టు" స్కీంలో భాగంగా పూడికతీయించాం.

  • అలికాం గ్రామ పంచాయతీ కరిమిల్లిపేట నుండి గార చింతాడ రోడికి కనెక్టింగ్ సీసీ రోడ్ నిర్మాణం.

  • ఎన్నోయేళ్ల నుండి అస్తవ్యస్తమైన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న రూరల్ మండల ప్రజలకు టి.డి.పి. హయాం (2014-19)లో ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ పరిసర ప్రాంతంలో గల గ్రామాలు (ఇప్పటి విలీన గ్రామాలు) చాపురం పంచాయితీలో విశాఖ 'బి' కాలనీ, చుట్టు ప్రక్క ప్రాంతాలు పాత్రునివలస పంచాయితీలో ఫ్రెండ్స్ కాలనీ మరియు చుట్టూ ప్రక్క ప్రాంతాలు, కిల్లిపాలెం పంచాయతీ విశాఖ 'ఎ' కాలనీ మరియు చుట్టూ ప్రక్క ప్రాంతాలకు, ఖాజీపేట పంచ్చయతీలో ఆదిత్య నగర్ కాలనీ మరియు చుట్టూ ప్రక్క ప్రాంతాలకు సుమారు 60 కి.మీ. మేర 30 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.

  • 16. శ్రీకాకుళం రూరల్ మండలం మొత్తం (2014-19) సుమారు 150 కి.మీ. పొడవున రూ.75కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.

  • నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా సింగుపురం గ్రామంలోని మామిడివలసలో 20 ఎకరాల చెరువుని అభివృద్ధి చేయడంతో పాటు డేగాను తీయడం జరిగింది.

  • శ్రీకాకుళం రూరల్ మండలం, సింగుపురం గ్రామంలో రనగాల చెరువుకి పాటిగుడ్డులు కాలనీ వాసుల సౌకర్యార్ధం మెట్లు నిర్మాణం.

మమ్మల్ని సంప్రదించండి / ఫిర్యాదులను అందించండి

మీ సమస్య యొక్క ఫోటోను అప్‌లోడ్ చేయండి *

టోల్ ఫ్రీ నంబరు : 123XX XXXXX